హోలీ స్పెషల్.. షాలిమార్ కు ప్రత్యేక రైళ్లు

హోలీ స్పెషల్.. షాలిమార్ కు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హోలీ రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి– షాలిమార్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి షాలిమార్​కు ఫిబ్రవరి 26, మార్చి 1, 5 తేదీల్లో ఉదయం 5:40 గంటలకు రైలు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. షాలిమార్ నుంచి చర్లపల్లికి ఫిబ్రవరి 27, మార్చి 2, 6 తేదీల్లో మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 9:50 గంటలకు 
చేరుకుంటుంది.